JavaScript is required
Relief and recovery support is available for people impacted by the January 2026 Victorian bushfires.
Visit Emergency Recovery Victoria

ఉచిత బాలశిక్షణ (About Free Kinder) - తెలుగు (Telugu)

విక్టోరియా అంతటా ఉన్నసేవలలో మూడు మరియు నాలుగు సంవత్సరాల కిండర్ లేదా ప్రీ-ప్రిప్ ప్రోగ్రామ్‌లలో ఉచిత కిండర్ అందుబాటులో ఉంది. ఇందులో దీర్ఘకాల పగటి సంరక్షణ మరియు స్వతంత్ర (దీనిని సెషనల్ అని కూడా అంటారు) కేంద్రాలు రెండూ ఉంటాయి.

కుటుంబాలకు పొదుపు

పాల్గొంటున్న సెషనల్ కిండర్ గార్టెన్‌లో చేరిన పిల్లలు ఉన్న కుటుంబాలు ఉచిత కార్యక్రమాన్ని పొందుతారు.

పాల్గొంటున్న లాంగ్ డే కేర్‌లో చేరిన పిల్లలు ఉన్న కుటుంబాలు వార్షిక రుసుము ఆఫ్‌సెట్‌ను పొందుతాయి.

ఉచిత బాలశిక్షణకు అర్హత

ఉచిత బాలశిక్షణ అనేది అందరి కోసం.

దీనిలో ప్రవేశానికి అర్హత పొందేందుకు, కుటుంబాలు హెల్త్ కేర్ కార్డ్ లేదా పెన్షన్ కార్డ్, ఆస్ట్రేలియన్ పౌరసత్వం లేదా చిరునామా రుజువును కలిగి ఉండవలసిన అవసరం లేదు. ఉచిత బాలశిక్షణని ఉపయోగించుకోవటానికి మీరు ఆస్ట్రేలియన్ ప్రభుత్వ చైల్డ్ కేర్ సబ్సిడీ (CCS) కి అర్హత పొందాల్సిన అవసరం కూడా లేదు.

మీరు ఒక సమయంలో ఒక బాలశిక్షణ కేంద్రంలో మాత్రమే ఉచిత బాలశిక్షణని అందుకోగలరు. మీ బాలశిక్షణ కేంద్రం, మీరు ఉచిత బాలశిక్షణని పొందే కేంద్రాన్నిపేర్కొంటూ ఒక లేఖపై సంతకం చేయమని మిమ్మల్ని అడుగుతుంది. మీ బిడ్డ ఒకటి కంటే ఎక్కువ బాల శిక్షణా కేంద్రాలకు హాజరైనట్లయితే, మీరు ఉచిత బాలశిక్షణని ఎక్కడ పొందుదామనుకొంటున్నారో ప్రతి కేంద్రానికి తెలియజేయాలి.

ఉచిత బాలశిక్షణ నిధులను ఎలా పొందాలి

ఉచిత బాలశిక్షణను అందించే బాల శిక్షణా కేంద్రాలు విక్టోరియన్ ప్రభుత్వం నుండి నేరుగా నిధులు పొందుతాయి. దీని అర్థం, కుటుంబాలు పొదుపును తిరిగి దావా చేయనవసరం లేదు, బదులుగా మీ ఫీజులు తగ్గించబడతాయి. పరిమిత బాలశిక్షణ (సెషనల్ కిండర్‌) లో మీ కార్యక్రమం ఉచితం.

'దీర్ఘ కాల పగటి సంరక్షణ' బాలశిక్షణ కార్యక్రమాలను ఉపయోగించే కుటుంబాలు, తమకు వచ్చిన బిల్లు లపై స్పష్టంగా పేర్కొనబడ్డ 'విక్టోరియన్ గవర్నమెంట్ ఫ్రీ కిండర్ ఆఫ్సెట్' ద్వారా, ప్రతి బిల్లులో ఉచిత బాల శిక్షణ ద్వారా లభించిన పొదుపు మొత్తాన్ని చూడగలుగుతాయి.

మీ జేబునుండి చెల్లించే రుసుములకు, రుసుము మినహాయింపు ఎలా వర్తించబడుతుంది

ఉచిత బాలశిక్షణ మినహాయింపు ఏడాది పొడవునా మీ రుసుములకు క్రమం తప్పకుండా వర్తించబడుతుంది (ఉదా. వారానికి లేదా పక్షం రోజులకు ఒకసారి). మీ ఇన్‌వాయిస్‌లో ‘విక్టోరియన్ గవర్నమెంట్ ఫ్రీ కిండర్ ఆఫ్‌సెట్’ అని స్పష్టంగా పేర్కొన్న మొత్తాన్ని మీరు చూడగలరు.

మీ రుసుములకు మినహాయింపు (ఆఫ్‌సెట్) ఎలా వర్తింపజేయబడుతుంది మరియు ఇది మీ ఇన్‌వాయిస్‌లో ఎలా చూపబడుతుంది అనే సమాచారం కోసం, దయచేసి మీ బాల శిక్షణా కేంద్రంతో నేరుగా మాట్లాడండి. మీ బిడ్డ వారానికి 15 గంటల కంటే ఎక్కువ ఉపయోగించుకొంటే, అదనపు గంటలకు మినహాయింపు వర్తించదు.

మీరు కామన్‌వెల్త్ చైల్డ్‌కేర్ సబ్సిడీ కి అర్హత కలిగి ఉంటే, అది ముందుగా వర్తించబడుతుంది. అంటే మీరు CCS తర్వాత మరియు ఉచిత బాలశిక్షణ మినహాయింపు తర్వాత మాత్రమే మిగిలిన మొత్తాన్ని చెల్లించాలి.

ఉదాహరణ:

  • 4 ఏళ్ల పిల్లవాడు వారానికి 3 రోజుల పాటు కిండర్ కార్యక్రమం వున్న సేవాసంస్థకు దీర్ఘ కాల పగటి సంరక్షణకి వెళ్తాడు.
  • వారానికి 3 రోజుల ఈ సేవకు $360 వసూలు ఉంటుంది (కిండర్ గంటలు మరియు అదనపు సంరక్షణ గంటలతో సహా).
  • ఆ కుటుంబానికి వారానికి $252 CCS లభిస్తుంది.
  • 2025లో, ఈ సేవ 40 వారాలకు పైగా వారానికి $2,101 ఉచిత కిండర్ ఆఫ్‌సెట్‌ను వర్తిస్తుంది (వారానికి $52.53).
  • CCS మరియు ఉచిత కిండర్ ఆఫ్‌సెట్ తర్వాత కుటుంబం వారానికి $55.478 చెల్లిస్తుంది.

దయచేసి గమనించండి. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఖర్చులు వ్యక్తిగత పరిస్థితులు మరియు వార్షిక ఉచిత కిండర్ ఆఫ్‌సెట్ మొత్తాన్ని బట్టి మారుతూ ఉంటాయి.

Updated