JavaScript is required
Relief and recovery support is available for people impacted by the January 2026 Victorian bushfires.
Visit Emergency Recovery Victoria

ఎలా మరియు ఎప్పుడు నమోదు చేసుకోవాలి (How and when to enrol) - తెలుగు (Telugu)

నమోదు ప్రక్రియ గురించి మీ స్థానిక కౌన్సిల్ లేదా బాలశిక్షణాకేంద్రం తో మాట్లాడండి. మీరు, మూడేండ్ల బాలశిక్షణాలయ విచారణ లైన్‌ 1800 338 663 కు ఫోన్ చేయవచ్చు లేదా 3YO.kindergarten@education.vic.gov.au కి ఇమెయిల్ చేయవచ్చు. మీ భాషలో మద్దతు కోసం లేదా ఒక అనువాదకుని కోసం మొదట 131 450 సంప్రదించండి.

ఎర్లీ స్టార్ట్ కిండర్ గార్టెన్ (ESK)

శరణార్థి లేదా శరణార్థి నేపథ్యం నుండి వచ్చిన పిల్లలు అదనపు సహాయము పొందవచ్చు, మరియు శిశు పాఠశాల ద్వారా బాలశిక్షణాలయం లో చేరటానికి ప్రాధాన్యత పొందవచ్చు. మీరు మీ బిడ్డను స్థానిక బాల శిక్షణా కేంద్రంలో నమోదు చేస్తున్నప్పుడు, శిశుపాఠశాల గురించి వారిని అడగవచ్చు, లేదా మరింత సమాచారం కోసం ఎర్లీ స్టార్ట్ కిండర్ గార్టెన్ సందర్శించండి.

ఎప్పుడు నమోదు చేసుకోవాలి

విక్టోరియాలో, పిల్లలకు 3 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, వారిని బాల శిక్షణ కార్యక్రమంలో చేర్చవచ్చు. మీ బిడ్డ మూడు మరియు నాలుగు సంవత్సరాల కిండర్ గార్టెన్ లేదా ప్రీ-ప్రిపరేషన్ ఏ సంవత్సరం ప్రారంభించవచ్చో తెలుసుకోవడానికి మీరు స్టార్టింగ్ ఏజ్ కాలిక్యులేటర్‌లో వారి పుట్టిన తేదీని నమోదు చేయవచ్చు.

మీ బిడ్డ జనవరి 1 మరియు ఏప్రిల్ 30 మధ్య జన్మించినట్లయితే, వారు మూడేళ్ల కిండర్ గార్టెన్‌ను ఏ సంవత్సరం ప్రారంభించాలో మీరు ఎంచుకోవచ్చు. మీ బిడ్డకు 3 సంవత్సరాలు నిండిన సంవత్సరంలోనే లేదా 4 సంవత్సరాలు నిండిన సంవత్సరంలో మూడేళ్ల కిండర్ గార్టెన్ ప్రారంభించవచ్చు. మీ బిడ్డకు 3 సంవత్సరాలు నిండినప్పుడు మూడేళ్ల కిండర్ గార్టెన్ ప్రారంభిస్తే, వారు 5 సంవత్సరాలు నిండినప్పుడు పాఠశాలకు వెళ్లడం ప్రారంభిస్తారు. మీ బిడ్డకు 4 సంవత్సరాలు నిండినప్పుడు మీరు వారిని మూడేళ్ల కిండర్ గార్టెన్‌కు పంపాలని ఎంచుకుంటే, వారు 6 సంవత్సరాలు నిండినప్పుడు పాఠశాలకు వెళ్లడం ప్రారంభిస్తారు.

బాల శిక్షణాకార్యక్రమాన్ని కనుగొనండి

ఆమోదించబడిన కిండర్ ప్రోగ్రామ్‌లను అందించే సేవలను కనుగొనడానికి, ఫైండ్ ఎ కిండర్ ప్రోగ్రామ్ వెబ్‌సైట్‌ను సందర్శించండి. మీ స్థానిక కౌన్సిల్ మరియు బాల శిక్షణా కేంద్రాలు కూడా బాల శిక్షణ కోసం చోటును కనుగొనడంలో మీకు సహాయపడతాయి.

కిండర్ టిక్ (గుర్తు) కోసం చూడండి

కిండర్ టిక్ విక్టోరియా కుటుంబాలు తమ పిల్లల కోసం, ఆమోదించిన కిండర్ కార్యక్రమం కనుగొనడంలో సహాయపడుతుంది.

మీ స్థానిక బాల శిక్షణాలయం వద్ద, దాని లోపల లేదా భవనం మీద లేదా మైదానంలో, వారి వెబ్ సైట్ లేదా వారి సమాచార పత్రాల లో కిండర్ టిక్ లోగో కొరకు చూడండి.

Updated