JavaScript is required
Relief and recovery support is available for people impacted by the January 2026 Victorian bushfires.
Visit Emergency Recovery Victoria

శిశు పాఠశాల (ఎర్లీ స్టార్ట్ కిండర్ గార్టెన్) (Early Start Kindergarten) - తెలుగు (Telugu)

మీరు శరణార్థి లేదా శరణార్థి నేపథ్యం నుండి వచ్చినట్లయితే, మీరు శిశు పాఠశాల (ఎర్లీ స్టార్ట్ కిండర్ గార్టెన్ - ESK) కి అర్హులు కావచ్చు. మీబిడ్డ కోసం ప్రతివారం సాధ్యమైనంత గరిష్ట మొత్తంలో ఉచిత బాలశిక్షణ (Kinder) కార్యక్రమ సమయం పొందేలా శిశు పాఠశాల సహాయపడుతుంది.

ఎలా దరఖాస్తు చేయాలి

శిశుపాఠశాల, అర్హత కలిగిన ఉపాధ్యాయుని ద్వారా అందించబడే అన్ని బాలశిక్షణా కార్యక్రమాల్లో లభ్యం అవుతుంది. మీకు సమీపంలో ఉన్న బాల శిక్షణాలయాన్ని సంప్రదించి, శిశుపాఠశాల (ఎర్లీ స్టార్ట్ కిండర్ గార్టెన్) గ్రాంట్‌ను అందుకోమని అడగడం ద్వారా మీరు మీ బిడ్డను నమోదు చేసుకోవచ్చు. మీ భాషలో మీకు మద్దతు ఇవ్వడానికి, బాల శిక్షణా కేంద్రాలు ఉచిత అనువాద సేవను అందుకోగలవు.

సహాయం కోసం మీరు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క మూడేండ్ల బాలల, బాల శిక్షణాలయం విచారణ నంబరు 1800 338 663 కు ఫోన్ చేయవచ్చు లేదా మీ స్థానిక పురపాలక సంఘాన్ని సంప్రదించవచ్చు. మీ భాషలో సహాయం పొందడం కొరకు మీరు నేషనల్ ట్రాన్స్ లేటింగ్ అండ్ ఇంటర్ ప్రెటేషన్ సర్వీస్ కు 131 450 కు ఫోన్ చేయవచ్చు. ఆ అనువాదకుని, మీ స్థానిక పురపాలక సంఘం లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కు ఫోన్ చేయమని అడగండి. అనువాదకులు ఫోన్ లో ఉండి తర్జుమా చేస్తారు.

ఎప్పుడు దరఖాస్తు చేయాలి

మూడేళ్ల కిండర్ గార్టెన్‌లో చేరేందుకు నమోదు చేసుకున్న సంవత్సరంలో ఏప్రిల్ 30 లోపు మూడు సంవత్సరాలు నిండినట్లయితే పిల్లలు ESKకి అర్హులు. 'ఎప్పుడు నమోదు చేసుకోవాలో' చూడండి.

మీ బిడ్డ జనవరి 1 మరియు ఏప్రిల్ 30 మధ్య జన్మించినట్లయితే, వారు మూడేళ్ల కిండర్ గార్టెన్‌ను ఏ సంవత్సరం ప్రారంభించాలో మీరు ఎంచుకోవచ్చు. మీ బిడ్డకు 3 సంవత్సరాలు నిండిన సంవత్సరంలోనే లేదా 4 సంవత్సరాలు నిండిన సంవత్సరంలో మూడేళ్ల కిండర్ గార్టెన్ ప్రారంభించవచ్చు. మీ బిడ్డకు 3 సంవత్సరాలు నిండినప్పుడు మూడేళ్ల కిండర్ గార్టెన్ ప్రారంభిస్తే, వారు 5 సంవత్సరాలు నిండినప్పుడు పాఠశాలకు వెళ్లడం ప్రారంభిస్తారు. మీ బిడ్డకు 4 సంవత్సరాలు నిండినప్పుడు మీరు వారిని మూడేళ్ల కిండర్ గార్టెన్‌కు పంపాలని ఎంచుకుంటే, వారు 6 సంవత్సరాలు నిండినప్పుడు పాఠశాలకు వెళ్లడం ప్రారంభిస్తారు.

మీ బిడ్డ శిశు పాఠశాలకి ఎప్పుడు అర్హత సాధిస్తారో లెక్కకట్టటానికి మీకు సహాయం అవసరమైతే, మీరు డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ని కాని, మీ స్థానిక పురపాలకసంఘాన్ని కాని, మీ మాతా మరియు శిశు ఆరోగ్య నర్సుని కాని, లేదా మీ ప్రాంతంలోని ఒక కిండర్, లేదా మీ ప్రాంతంలోని దిగువ పేర్కొన్న సంస్థల్లో దేనినైనా సంప్రదించవచ్చు:

  • మూడేండ్ల బాలల శిక్షణ విచారణ ఫోన్ 1800 338 663
  • బ్రదర్ హుడ్ ఆఫ్ లారెన్స్ 03 9483 1183
  • ఫౌండేషన్ హౌస్ 03 9389 8900
  • ఎఫ్ కె ఎ చిల్డ్రన్స్ సర్వీసెస్ 03 9428 4471
  • VICSEG న్యూ ఫ్యూచర్స్ 03 9383 2533

నా బిడ్డ నాలుగు సంవత్సరాల కిండర్ గార్టెన్ కి వెళ్ళాలా?

అవును, ఎర్లీ స్టార్ట్ కిండర్ గార్టెన్ లో అర్హత పొందిన పిల్లలు ఉచిత లేదా తక్కువ ధర కలిగిన నాలుగేళ్ల కిండర్ గార్టెన్‌కు కూడా అర్హులు. 2025 నుండి నాలుగు సంవత్సరాల కిండర్ గార్టెన్ క్రమంగా ప్రీ-ప్రిపరేషన్ గా మారుతోంది. 2026 లో, ప్రతి వారం ఈ క్రిందనుదహరించిన పిల్లలకు 25 గంటల వరకు ప్రీ-ప్రిపరేషన్ అందుబాటులో ఉంటుంది:

  • శరణార్థి లేదా శరణార్థి నేపథ్యం నుండి వచ్చినవారు
  • ఎబొరిజినల్ లేదా టొర్రిస్ స్త్రైట్ ఐలాండర్ గా గుర్తించిన వారు
  • వారి కుటుంబానికి బాలల రక్షణతో సంబంధాలు వున్న వారు.

గత సంవత్సరంలో ESK ద్వారా నమోదు చేసుకోవడం వల్ల మీ బిడ్డ విక్టోరియాలో ఎక్కడ నివసిస్తున్నా, ప్రతి వారం పెరిగిన ప్రీ-ప్రెప్ గంటలను పొందగలరని హామీ ఇస్తుంది. గత సంవత్సరంలో ESKలో నమోదు చేసుకోకపోయినా కుటుంబాలు ప్రీ-ప్రిపరేషన్‌కు అర్హులు అవుతారు.

Updated